Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

హైదరాబాద్ కార్పొరేటర్లు చేసిన తీర్మానాలకు తూట్లు

  హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు చేసిన తీర్మానాలకు తూట్లెందుకు…? నిండు సభలో కార్పొరేటర్లు లేవనెత్తిన ఆరోపణలపై విచారణ ఎందుకు చేయడం లేదు…? విచారణను అడ్డుకుంటుందెవరు…? దీని వెనుక అసలు కారకులెవరు..? రెండు వారాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ హౌజ్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు…?

      గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం..జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కౌన్సిల్ సమావేశం. నగరంలో లోపించిన పారిశుద్ధ్యం, ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై రెండు వారాల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈనేపథ్యంలోనే కార్పొరేటర్లు, అధికారుల చర్యలను దుయ్యబట్టారు. కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీలు వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయ్యారు కార్పొరేటర్లు. హౌజ్ కమిటీలు వేయాలని నిర్ణయించినా కమిటీల ఏర్పాటు జరగలేదు. 

     గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో శానిటేషన్ పరిరక్షణ పనులు చేపడుతోంది బీహెచ్ఎంసీ. 20వేల మంది కార్మికులు..వందలాది మంది ఉద్యోగులు పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా దాదాపు 900 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు అవుతుంది. అయినా సిటీలో శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు పారిశుద్ధ్యం లోపించిందని..ఎక్కడా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అన్ని పార్టీల కార్పొరేటర్లు సంబంధిత డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతోంది…అధికారులు చర్యలు ఎలా ఉన్నాయి…ఎంత ఖర్చు అవుతుంది అన్నీ అంశాలపై లెక్కలు తేల్చాలని డిసైడ్ చేశారు. అంతే కాకుండా అందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. ముఖ్యంగా అదనపు కమీషనర్…కొద్దిమంది మెడికల్ అధికారులు…ట్రాన్స్ పోర్టు అధికారులు.. స్విపింగ్ మిషన్లు…రాంకీ వ్యవహారంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రకటనల విభాగంలో కూడా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం రాకుండా కొంతమంది అధికారులు, కొన్ని ఏజెన్సీ లు చేశాయని మండిపడ్డారు కార్పొరేటర్లు. ఈ అంశంపై కూడా పూర్తిస్థాయిలో స్టడీ చేసి తీసుకోవాల్సిన చర్యలను సూచించేలా హౌజ్ కమిటీలు వేయాలని డిసైడ్ చేశారు. ఈ విభాగంలో కార్తీక్ అనే డిప్యూటీ ఇంజనీర్ కార్తీక్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కౌన్సిల్లో మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 19న జరిగింది. రెండు వారాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ కమిటీలు ఏర్పాటు చేయలేదన్నారు. 

     ప్రకటణల విభాగంలో  అనుమతులకంటే  ఎక్కువ బస్సు షల్టర్లు ఎర్పాటు చేసిన  ఎజెన్సీలు… వాటి గురించి తెలిసిన  అధికారులు వాటిని గుట్టు చప్పుడు కాకుండా తోలగిస్తున్నారు. నగరంలోని  3 వేల కిలో మీటర్ల మేరా బస్ రూట్లు ఉన్నాయి. అయితే అక్కడ వేలాది సంఖ్యలో బస్ షల్టర్లు ఎర్పాటు చేశారు ఎక్కడ  ఏలాంటి షల్టర్లు ఎర్పాటు చేశారనే అంశంపై క్లారీటి లేదు. హౌజ్ కమీటిలు వేస్తే వాటిని కార్పోరేటర్లు మరియు ఉన్నతాదికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనే అవకాశం ఉంది. కాని కమీటిలు ఆలస్యం అయితే అక్రమంగా షల్టర్ల ద్వారా ఎళ్ల తరబడి ఆదాయాన్ని రాబట్టుకున్న సంస్థలు వాటిని తోలగించే పనిలో పడ్డాయి. ఇక సిటీలో శానిటేషన్, ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా హౌజ్ కమిటీ ఏర్పాటు ఆటకెక్కింది. ఇప్పటికైనా మేయర్ ఈ అంశంలో ఫోకస్ చేయాలని కోరుతున్నారు కార్పొరేటర్లు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్