‘బ్రో’ నుంచి మొదటి సాంగ్.. ప్రొమోషన్స్ మొదలెట్టిన చిత్ర బృందం

స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. ‘గోపాల గోపాల’ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన పవన్.. ఈ చిత్రంలో మరోసారి టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” మై డియర్ మార్కండేయ ” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే సమయం మాత్రం చెప్పలేదు. త్వరలోనే అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే.. సినిమా రిలీజ్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంది.. ప్రమోషన్స్ ఇంకా స్లోగా ఉన్నాయి. ఈ సాంగ్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టి.. వరుస ప్రమోషన్స్ చేస్తే సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు, ఎలాగూ పవన్ ప్రమోషన్స్ కు రాడు .. మిగిలినవారైనా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు లేకపోతే సరికొత్త ప్రమోషన్స్ మొదలుపెడితే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ లో మ్యూజిక్ ఆల్బమ్ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మరి థమన్ ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలి.

కాగా ఈ సినిమాలో కేతిక శర్మ సాయి ధరమ్ కి జోడిగా నటిస్తుంది. అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఒక తెలుగులోనే 70 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ సెల్ అయ్యినట్లు సమాచారం.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్