‘కన్నప్ప’లో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో ఇప్పటికే ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ కాస్ట్ యాక్ట్ చేస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చ జరిగింది. స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో స్టార్ హీరోయిన్ ఎవరినైనా తీసుకుంటారనే గాసిప్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రంలో విష్ణు సరసన హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్.

ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు. ‘కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..‘‘ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’’ అని అన్నారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్