సంగం బండ ప్రాజెక్ట్ పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగం బండను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రజా దీవెన సభలో భట్టి, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గం నుంచి అన్ని ప్రతిపాదనలను ఆమోది స్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్న మంత్రి … గత పాలకులు పైసల కోసమే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. సంగంబండ ప్రాజెక్టులో గతంలో, ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసని మంత్రులు చెప్పారు.