31.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం

         తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపును.. మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ… అదే సీన్‌ను పార్లమెంటు ఎన్నికల్లోనూ పునరావృతం చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ జపం చేస్తూనే.. ప్రతిపక్షాల్ని కోలుకోకుండా దెబ్బతీసే వ్యూహాల్ని అమలు చేస్తోంది. మరి.. కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు వర్కవుటవుతాయి ?

      పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి ఢిల్లీ పీఠంపై రాహుల్‌ గాంధీని కూర్చోబెట్టాలన్న తమ కలను నిజం చేసుకునే పనిలో.. వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల సాధనే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో కనీసం 13 నుంచి 14 సీట్లలో గెలుపును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గెలుపును టార్గెట్‌గా పెట్టుకోవడమే కాదు.. అందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తోంది హస్తం పార్టీ. ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూనే.. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించింది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కారు. సీతారామ స్వామి కొలువుతీరిన భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. తద్వారా ఐదో పథకం అమలు చేశామంటూ గర్వంగా చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.

       అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు పథకాలను ప్రారంభించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్న పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు. ఇటీవలె మరో రెండు సంక్షేమ కార్యక్రమాలను సైతం మొదలు పెట్టారు. అర్హులైన వారికి ఐదు వందలకే గ్యాస్ సిలెండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని సైతం ఇటీవలె అమలు చేయడం ప్రారంభిం చారు. తాజాగా.. మరో పథకం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది రేవంత్ సర్కారు. తద్వారా హామీలను ఇవ్వడమే కాదు.. అమలు చేయడం ద్వారా ప్రజలను మరింతగా కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. అటు.. విపక్షాలను టార్గెట్‌ చేస్తూ తమదైన రాజకీయాలు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మెజార్టీ మార్కుకు కొద్ది దూరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఏడాదిలోగా రేవంత్ సర్కారు కూలిపోతుందని ప్రతిపక్ష పార్టీలు జోస్యం చెప్పడం ప్రారంభించాయి. దీంతో.. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొద్ది రోజులు ఓపిక పట్టిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించారు. దీంతో.. పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్‌ రెడ్డితో టచ్‌లోకి వచ్చేశారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు సైతం లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది.

     ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాము నిజంగానే గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం ఇదే కాదు.. కాళేశ్వరం విషయాన్ని హైలెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు హస్తం నేతలు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్ పాపాలతోనే కాళేశ్వరం కూలిపోయిందన్న ఆయన.. మేడిగడ్డ మేడిపండు చందంగా మిగి లిందన్నారు ముఖ్యమంత్రి.ఇలా అందివచ్చిన అన్ని అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి హస్తం పార్టీ వ్యూహాలు సార్వత్రిక ఎన్నికల్లో ఏ మేరకు సక్సెసవుతాయి అన్నది త్వరలో తేలనుంది.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్