స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి ఆలయ ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు. ప్రభాస్ విరాళంగా అందించిన మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు వారు ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాద్రి రాములోరి ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం
0
323
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


