30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంద్ – పాత వాహనాలను పసిగట్టేందుకు గాడ్జెట్స్

చర్య మంచిదే.. నిర్ణయం ఉత్తమమైందే. అయితే, ఆలస్యం అమృతం విషయం ఫార్ములా ఫాలో అయినా, ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటే.. నిదానమే ప్రధానం మాట బోటైపోదా..! సామాన్యుల కష్టాలు, నష్టాల సంగతేమిటి. అపురూప ఇష్టాల మాట ఏమై పోవాలి. అదేదో సినిమాలో ఆకాశం ఏమి అరుణవర్షంలో మెరిసిపోతోంది.. అక్కడేమైనా మర్డర్ అయ్యిందా.. అని విలన్ వ్యాఖ్యానిస్తాడు. అంతే మరి.. విలన్ లకు మర్డర్ లు, మానభంగాల ఆలోచనలు తప్ప మరేం ఉంటాయి. ఇప్పుడు చాలా చోట్ల కాలుష్యకారకాల వల్ల ఇక్కట్లు వస్తున్నాయి. ప్రత్యేకించి వాయుకాలుష్యంతో ఆకాశం నల్లమొద్దులా మారిపోతోంది. రాత్రేదో, పగలేదో తెలియని విధంగా తయారవుతోంది. ఇక కాలుష్యంతో వచ్చే రోగాలు, బాధలకు అంతే లేకుండా పోతోంది.

మొన్న మొన్నే దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పాత ప్రభుత్వం పక్కకెళ్లింది. కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆప్ సర్కారు గాయబ్ అవ్వడానికి, కొత్త సర్కారు కొలువు తీరడానికి కారణం ఏమిటంటే కాలుష్యఅంశమే. ఆకాశం మేఘావృతం అయ్యింది అని వాతావరణ శాఖ చెప్పడం మనకు తెలుసు. అయితే, ఢిల్లీలో అయితే.. ఆకాశం ఆ స్థాయిలో కాలుష్యం అయ్యిది, ఈ స్థాయిలో కలుషితం అయ్యింది.. అనే ఎప్పటికప్పుడు వార్తలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాయు కాలుష్య నియంత్రణలో అప్పటి ఆప్ ప్రభుత్వం చర్యలేమీ చేపట్టలేదు. దీన్ని అస్త్రంగా తీసుకున్న బీజేపీ.. ఎన్నికల సభల్లో ఈ విషయాన్ని ఆకాశస్థాయికి ఎత్తేసి.. ఆప్ ను ఓడించేసి అధః పాతాళానికి తోసేసింది.

నాడు హామీలు గుప్పించి.. ఇప్పుడు తమరేం చేస్తున్నారని ప్రజలు ఎక్కడ ప్రశ్నించేస్తారో.. అని భయపడ్డారో, లేక ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడిలా మారి, ఇచ్చిన హామీలను తూచ తప్పక అమలు చేసేద్దామనో, తాము ప్రజా పక్షపాతులం, వాయుకాలుష్య వ్యతిరేకులం అని వెల్లడించడానికి ఢిల్లీలో కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయాలు ప్రకటించేసింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, అధికారులు సమావేశం అయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ఎలా ప్రవర్తించినా…..తాము పక్షం ఏళ్లు పైబడిన వాహనం కనబడితే షెడ్డుకు చేర్చే చర్యలు చేపడ్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తరువాత బంకుల్లో ఇంధనం పోయరాదనే నిర్ణయం తీసేసుకున్నారు.

ఇందుకు సంబంధించి పర్యావరణశాఖ మంత్రివర్యులు మంజిందర్ సింగ్ సిర్సా చెప్పిందేమిటంటే… పెట్రోల్ బంకుల వద్ద గాడ్జెట్ లు ఏర్పాటు చేస్తామని, 15 ఏళ్లు పైబడిన వాహనాలు కనబడితే, అవి ఠక్కున పట్టేస్తాయని, అలా పట్టుబడిన వాహనాలకు ఇక ఇంధనం సరఫరా ఉండదని చెప్పారు. దీంతో, ఆ పాత వాహనం షెడ్డుకెళ్లడం తప్పదని తేలిపోయింది. ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎన్ జీ బస్సులను దశలవారీగా ఉపసంహరిస్తామని చెప్పారు. ఈ బస్సుల సంహార కార్యకర్యక్రమం అయ్యాక ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిసింది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోతోంది. వాయు కాలుష్యంతో నగరవాసులు స్వచ్ఛమైన గాలికి నోచుకోక అనారోగ్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య ప్రభావం నగరంలో ఎన్నో సంస్థల మీద పడుతోంది. విద్యా సంస్థలు మూసేస్తున్నారు, విమానాల రాకపోకలపై నిషేధాలు విధిస్తున్నారు… ఇలా ఎన్ని ఇబ్బందికర చర్యలు తీసుకురావడంతో.. జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది. ఇదేకాక, కొత్త ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన తుక్కు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. తుక్కు విధానం వల్ల ఫిట్ నెస్ లేని వాహనాలకు స్వస్తి పలకడంతో పాటు కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుంది.

ఇదంతా బాగానే ఉన్న.. ఆకస్మికంగా ఓల్డ్ వాహనాలకు సంకెళ్లు వేసేస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకునే వాహనబాబులు కాస్త ఆవేదనకు గురవుతున్నారు. కొందరు తమ వాహనాన్ని చంటి బిడ్డలా చూసుకుని.. కొత్త వాహనం మాదిరే కొత్తగా ఉంచుకున్నవారు ఉన్నారు. ఏ కంప్లయింట్ లేకపోయినా…వధ్యశాలకు పశువులను తీసుకెళ్లినట్టు.. 15 ఏళ్ల సర్వీస్ ఉన్న వాహనాన్ని స్క్రాప్ వెహికిల్ షెడ్ కు తీసుకెళ్లిపోవడం తమకు ఆవేదన కల్గిస్తోందని అంటున్నారు. ఫిట్ నెస్ లేని వాహనాల వల్ల భవిష్యత్తులో పెద్దవాయు ఉపద్రవం రాబోతుందని సైంటిస్టులు హెచ్చరించడంతో.. ఈ చర్యలు అనివార్యం అని ఢిల్లీ సర్కారు తెలియజేస్తోంది.
————–

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్