స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను నేటి నుంచి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని 63.14లక్షల మంది లబ్దిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తన్ని ప్రభుత్వం అందచేస్తుంది. నేటి నుంచి జూన్ 5వ తేదీ లోపు వాలంటీర్ల ఆధ్వర్యంలో తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్మును వాలంటీర్లు అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గురువారం నుంచి పింఛన్ల పంపిణీ జరగనుంది. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవారమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా.. స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వాలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పంపిణీ ప్రక్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
నేటి నుంచి ఇంటి వద్దనే లబ్దిదారులకు ఫించన్లు
0
325
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


