రూ. 50కే ‘పేక మేడలు’ పెయిడ్ ప్రీమియర్స్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ‘ఎవరికీ చెప్పొద్దు’ థియేటర్, ఓటిటిలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండో సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్నాడు వినోద్ కిషన్. గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ మరియు హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : సినిమా ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభిస్తుంది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారు చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులు కూడా మేము ఏ ప్రమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్