అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలోని పాత గుంతకల్‌కు చెందిన పులికొండ తన భార్య సాయి తేజను హత్య చేశాడు. భర్త పులికొండ వైరుతో తల కోసుకుపోయే విధంగా గట్టిగా బిగించి హత్య చేశాడు. హత్య చేసి తన 8నెలల చిన్నారిని ఎత్తుకుని రాత్రి రెండు గంటల సమయంలో పరార్ అవుతుండగా వీధిలో పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్న యువకులు పులికొండను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం సాయి తేజ గుత్తికి చెందిన పులికొండతో వివాహం జరిపించినట్లు మృతురాలు తండ్రి నారాయణస్వామి తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం
0
389
Previous article
Latest Articles
సీఎం టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. మళ్లీ కిరికిరి
కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) పర్యటన రాజకీయంగా కాక రేపింది. సీఎం పర్యటనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,...
- Advertisement -
- Advertisement -


