నా ఊపిరి ఆపేయమంటారా? వైసీపీపై పవన్ ఫైర్

కోపం, ఆవేశం ఉన్నవాళ్లు రాజకీయాల్లో తగ్గి ఉండాలని ఎవ్వరు చెప్పినా జనసేనాని పవన్ కల్యాణ్ వినలేదు. తను నమ్మిన దారిలోనే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా వెళ్లిపోతున్నారు. ఎక్కడా ఆయన ఒక్క అడుగు కూడా తగ్గలేదు.

తాజాగా పవన్ కల్యాణ్ ప్రచార రథం ‘వారాహి’ ఆలీవ్ గ్రీన్ కలర్ లో ఉండటంతో వైసీపీ నేతలు అడ్డు చెప్పడం, రోజుకొక కామెంట్లు చేయడంతో పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్నో ఆపారు,  చివరికి నా ఊపిరి కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు.

ఈ తీవ్రమైన పద ప్రయోగంతో మళ్లీ రాష్ట్రంలో వైసీపీ-జనసేన మధ్య మాటల వాగ్యుద్ధం తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇంతకీ పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఆలీవ్ కలర్ షర్ట్ వేసుకుని ఇది వేసుకోవడానికైనా వైసీపీ అనుమతిస్తుందా?లేదా? అంటూ ట్వీట్ చేయడం విశేషం.

‘‘మొదట నా సినిమాలు ఆపారు, విశాఖలో ఆపేశారు, కనీసం హోటల్ రూమ్ నుంచి కూడా బయటకు రానివ్వలేదు, అంతేకాదు బలవంతంగా పంపేశారు. మంగళిగిరిలో అడ్డుకున్నారు. కనీసం కారు కూడా దిగనివ్వలేదు, నడిచి కూడా వెళ్లనివ్వలేదు. ఇప్పుడు నా ప్రచార రథం రంగు అంటున్నారు. ఇక నా ఊపిరి కూడా తీసుకోవడం ఆపేయమంటారా? అని తీవ్రంగా స్పందించారు.

ఇప్పుడు పవన్ ట్వీట్ తో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో, అటు వైసీపీ ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్