డిప్యుటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించిన పవన్

     ఇన్నాళ్లు అభిమానులకు పవర్‌ స్టార్‌గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్‌ అయిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు.ఉదయం 10గంటల 47 నిమిషాలకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు పవన్‌ కల్యాణ్‌. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్లమీద పవన్‌ సంత కాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అయ్యారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్‌ తదితరులు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్