ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహ రించాలని బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల కేశవ్. ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బుచ్చయ్యచౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయిం చనున్నారు గవర్నర్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.