Free Porn
xbporn
23.7 C
Hyderabad
Saturday, July 20, 2024
spot_img

ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందంటున్న ఎలన్ మస్క్

    సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. ఓటమి పాలైన పార్టీలు అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలోనే ఈవీఎం ల గురించి మరోసారి విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌ సైతం ఈ దిశ గా కీలక వ్యాఖ్యలే చేశారు. ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన కామెంట్లు ఉండడం తో మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మస్క్ చెప్పినట్లుగా అసలు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందా ? ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

    ఎన్నికల్లో వాడే ఈవీఎంలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవలె సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మిత్రపక్షాలతో కలిపినా బొటాబొటీ మార్కులతో మాత్రమే పాసయ్యింది మోడీ సర్కారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల తోపాటే కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకించి ఏపీతోపాటు ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ల్లో అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలు దారుణమైన పరాజయాలను చవిచూసిన పరిస్థితి నెల కొంది. ఈ ఫలితాలే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మారోసారి చర్చకు దారి తీసేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్బంగానే ఈవీఎంలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ సహా పలు విపక్ష నేతలు విమ ర్శలు గుప్పించారు. బీజేపీ అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసినట్లుగానే ఈవీఎంలను మేనేజ్ చేస్తుం దని ఆరోపించారు. ఇక, ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వచ్చిన రిజల్ట్స్ చూసి అప్పటి అధికారపక్షాలు కంగుతిన్నాయి. ఈవీఎంలపై తమకు అనుమానాలున్నా యంటూ చెప్పు కొచ్చాయి. ప్రధానంగా ఒడిషాలో కమలానికి ఏమాత్రం బలం లేకపోయినా, అక్కడ అప్రతిహతంగా విజయాలు సాగిస్తున్న బిజూ జనతాదళ్ అధికారం కోల్పోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి.

   ఎక్కడిదాకో ఎందుకు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ సైతం పరోక్షంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇలా వస్తాయని తాను అనుకోలేదన్న ఆయన. ఏదో జరిగిందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. కానీ, అందుకు సాక్ష్యాలు మాత్రం లేవని వ్యాఖ్యానించారు. కేవలం జగనే కాదు. వైసీపీ నేతలది సైతం పలువురిది ఇదే మాట. అయితే ఈ ఆరోపణలను విజయం సాధించిన పార్టీలు మాత్రం కొట్టిపారే స్తున్నాయి. గెలిచినప్పుడు ఒకలా ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలపై విమర్శలు గుప్పించడం సర్వసాధా రణమని చెప్పుకొస్తున్నాయి. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవలె నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఈవీఎంలను వ్యక్తుల ద్వారా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పోస్ట్ చేశారాయన. ఇదే ఇప్పుడు సంచలనానికి వేదికైంది.

    మస్క్ పోస్ట్‌పై విపక్షాలు తమ గొంతు కలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయన నేతలు మాత్రమే కాదు. శ్యాంపిట్రోడా లాంటి వారు సైతం తమవిమర్శలకు పదును పెట్టారు.అసలు తమ ఓటమిలో ఈవీఎంల పాత్ర ఎంతో ఉందన్న వాదనలను బలంగా విన్పిస్తున్నారు విపక్ష నేతలు. అయితే వీరి కామెంట్లకు అధికార పార్టీల నేతలు సైతం అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈవీఎంల హ్యాకింగ్ మన దేశంలో సాధ్యం కాదని చెబుతున్నారు.దీంతో మరో సారి ఈవీఎంల పనితీరుపై చర్చ మొదలైంది.వాస్తవానికి గతంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మన దగ్గర ఎన్నికలు నిర్వహించే వారు. కానీ, ఓట్ల లెక్కింపునకు పెద్ద ఎత్తున సమయం పడుతోందని చెప్పి, ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈసీఐఎల్‌ సహా పలు చోట్ల తయారయ్యే ఈవీఎంలను క్షుణ్నంగా పరిశీ లించి ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాతి కాలంలో వీటిపై విమర్శలు మొదల య్యాయి. దీంతో ఎన్నికల అధికారులు, తయారీదారులు వీటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ప్రకటించారు. అలా ఎవరైనా నిరూపిస్తే మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించగా, ఎవరూ ఆ సవాలు ను స్వీకరిం చలేదు. కానీ, ఎప్పుడు ఏ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా, మొదట చెప్పేమాట ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.అసలు ఈవీఎంలకు ఇంటర్ నెట్ కనెక్షన్, వైఫై, బ్లూటూత్‌ కనెక్షన్ లాంటివి లేవని గుర్తు చేస్తు న్నారు నిపుణులు. అలాంటప్పుడు ఇవి ఎలా హ్యాకింగ్‌కు గురవుతాయని ప్రశ్నిస్తు న్నారు. అయినా ఈ చర్చ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి వేళ మస్క్‌ కామెంట్లతో మొదలైన చర్చ విమర్శలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళతా యోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Articles

హీరోయిజం గురించి ఎన్టీయార్ బామ్మర్ది భలే చెప్పాడు: అల్లు అరవింద్

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్