పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్.. తాజాగా ఓజీ(OG) షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ చిత్రానికి యంగ్ క్రేజీ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్.. పవన్ కల్యాణ్ వీరాభిమాని కావడంతో ఈ చిత్రంలో పవన్ ను ఓ రేంజ్ లో చూపించడానికి రెడీ అయ్యాడు. అందుకు తగ్గట్లే వరుస సినిమా అప్టేడ్స్ ఇస్తూ క్రేజ్ క్రియేట్ చేశాడు.

ఇటీవలే గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం.. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ‘Fire Strom is Coming’  అంటూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. వచ్చే వారం నుంచి పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలిపింది. సినిమా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో గ్రాండ్ గా తెరకెక్కనుందని వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరోను స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా సుజిత్ చూపించనున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్