25.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

పరేషాన్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌

   పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇకపై సినిమాలు చేస్తారా..? ఏపీ సర్కార్‌లో కీలక బాధ్యతలు చేతపట్టిన సేనాని మళ్లీ తెరపై కనిపిస్తారా..? మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ , సినిమా విడుదల అంటూ ఫ్యాన్స్‌ హంగామా చేస్తారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరించిన వేళ సినిమాలు కంటిన్యూ చేస్తారా..? లేదంటే చిత్రాలకు దూరంగా ఉంటారా..? చేతిలో ఉన్న మూవీస్‌ పరిస్థితి ఏంటి..? పవన్‌ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..?

  పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మూవీ రిలీజ్‌ అంటే ఆయన అభిమానులకు పండగే. ఆ హంగామా అంత ఇంతా కాదు. పవన్‌ చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులు, చేసే ఫైట్‌లకు అభిమానుల కేరింతలతో థియేటర్‌ దద్దరిల్లాల్సిందే. మూవీ విడుదల అంటే చాలు. పోస్టర్‌ నుంచి సినిమా రిలీజ్ వరకూ ఆ హంగామానే వేరు. తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల వద్ద ఫ్యాన్స్‌ జాతరే. ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా విడుదల అవుతుందా అని ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అందుకే అసలు పవన్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. అలాంటిది పవన్‌కల్యాణ్‌ చిత్రాలకు దూరంగా ఉంటారన్న టాక్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్‌. ఏపీలో డిప్యూటీ సీఎంగా అత్యంత కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో మళ్లీ తమ హీరో సినిమాలు చేస్తారా లేదా అన్న టెన్షన్‌ పట్టుకుంది. మరోపక్క ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటన్న ఆసక్తి నెలకొంది. ఒప్పుకున్న సినిమాలైనా పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానంలో ఉన్నారు.

   పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే సినిమాలు మానేస్తానని ప్రకటించి, జనసేన ఆవిర్భావం తర్వాత సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక పార్టీని నడపడం కోసం తప్పనిసరి పరిస్థితులలో మళ్లీ సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలువడ మే కాదు.. డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల పరిస్థితి ఏంటన్న సందేహం అందరిలోనూ మెదులుతోంది. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేయడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇంత పెద్ద బాధ్యతలు భుజానకెత్తుకున్న పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటారన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో చేతిలో ఉన్న సినిమాల సంగతేంటన్న ఆసక్తి నెలకొంది.

    ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు , ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే,ఈ 3 సినిమాలు మాత్రం పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట పవన్‌కల్యాణ్. ఒప్పుకున్న ఈ మూడు సినిమాలు పూర్తి చేసి కొత్త సినిమాలు చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన ఫోకస్‌ అంతా భుజానికెత్తుకున్న బాధ్యతలపైనే ఉన్నట్టు సమాచారం. అందుకే తన సమయాన్ని కేవలం రాజకీయాల కోసమే కేటాయించాలనుకుంటు న్నట్టు తెలుస్తోంది. దీంతో రానున్న ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటారని, తెరపై చూడటం కష్టమే అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్