ఏపీ సీఎం జగన్ పై మరోసారి పవన్ వ్యంగ్యాస్త్రాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ పాపం పసివాడు అంటూ కౌంటర్ ఎటాక్ చేసిన పవన్.. తాజాగా అన్నమయ్య డ్యామ్ పునర్ నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యంపై ప్రశ్నించారు. నవంబర్ 9, 2021లో సంభవించిన అకాల వరద కారణంగా అన్నమయ్య డ్యామ్ తెగిపోయి సమీప గ్రామల్లో 33మంది జలసమాధి అయ్యారని గుర్తుచేశారు.

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హైలెవెల్ కమిటీ వేస్తున్నామని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారని పవన్ తెలిపారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు ఏ సూచనలు చెప్పారో, ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ దుర్ఘటన జరిగి నేటితో 18 నెలలు అయిందని నేటికి కూడా ఒక్క పని కూడా జరగలేదని విమర్శించారు. ఈ 18 నెలలలో చేసింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారని ఆరోపించారు. అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారన్నారు. అంతర్జాతీయంగా ఈ ఘటనపై అధ్యయనం జరిగితే భారత ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారని వెల్లడించారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్