కన్నబిడ్డను అమ్మేసి ఐఫోన్ కొన్న తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

 స్వతంత్ర వెబ్ డెస్క్: వస్తువుల్ని వాడుకోవాలి.. తోటి మనుషులపై ప్రేమ చూపించాలి. కానీ ప్రస్తుత కాలంలో మనుషుల్ని వాడుకుంటున్నారు వస్తువులపై ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. అంతేకాదు వస్తువుల మోజుతో కన్నబిడ్డల్నే కూరగాల్లా అమ్మేస్తున్నారు. ఐఫోన్ కొనుక్కోవటానికి ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు. ఇన్ స్టాలో రీల్స్ కోసం కన్నబిడ్డను అంగడి సరుకులా అమ్మేసారు కన్నవారు. ఐఫోన్ కొనుగోలు చేయటానికి ఏకంగా కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ నివసిస్తున్నారు. వారికి ఏడేళ్ల కూతురు, ఎనిమిది నెలల మగబిడ్డ ఉన్నారు. వీరికి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఉంది. ఇన్ స్టాలో రీల్స్ చేసిన పోస్ట్ చేయాలనుకున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారు. కానీ ఐఫోన్ ఉంటే ఇంకా బాగుంటుందిగా అనుకున్నారు. అంతే తమ ఎనిమిది నెలల మగపిల్లాడిని బేరం పెట్టారు. మంచి బేరం రావటంతో అమ్మేసారు. ఆనక చక్కగా ఆ డబ్బులు పట్టుకెళ్లి ఐఫోన్ కొనుక్కున్నారు.

కానీ ఇంట్లో ఉండే చంటిబిడ్డ కనిపించకపోవటంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించారు. దానికి వారు తమ బిడ్డను అమ్మేసి ఐఫోన్ కొన్నామని..ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నామని నిశ్చంకోచంగా చెప్పేశారు. కనీసం ఏదో అబద్దం ఆడటానికి కూడా యత్నించకుడా అంత నిర్భయంగా వారు చేసిన పని చెప్పటంతో స్థానికులు షాక్ అయ్యారు. అంతే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు దంపతులను ప్రశ్నించగా వారు స్థానికులకు చెప్పినమాటే పోలీసులకు కూడా చెప్పారు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. సిగ్గులేదా ఇలా చెప్పటానికి అంటే సిగ్గెందుకు..? అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను ఎవరికి అమ్మారు? ఎవరి ద్వారా అమ్మారు అని విచారిస్తున్నారు.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్