డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు ఆయనకు స్వల్ప గుండె పోటు రావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. మైనర్ హార్ట్ స్ట్రోక్ కావడంతో ప్రమాదం లేదన్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ వెళ్లిన పద్మారావు గౌడ్.. తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు