Free Porn
xbporn
23.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

పడకేసిన పల్లె దవాఖానాలు

రాష్ట్రంలోని పల్లె దవాఖానాలు పనిచేయడం లేదు. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించాల్సిన పల్లె దవాఖానాలకు ఇప్పుడు జబ్బు చేసింది. డాక్టర్లు లేక పల్లెల్లో వైద్యం పడకేసింది. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ వైద్య శాలలు అలంకార ప్రాయంగా మారాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖానాల్లో వైద్యలు అందుబాటులో లేరు. డాక్టర్లు లేకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయడానికి వైద్యులు ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేలకు పైగా పల్లె దవాఖానాలు ఉంటే అందులో 2వేలకు పైగా దవాఖానాల్లోనే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి ఎంబీబీఎస్ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. కానీ రూరల్ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో స్టాఫ్ నర్సులతోనైనా సరిపెట్టాలనుకుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా పల్లె దవాఖానాల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరవ చేసేందుకు నిర్మించిన పల్లె దవాఖానాలు వాడకంలోకి రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాక పోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 27 చోట్ల వైద్యలు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. 2021లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4,830 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానా లుగా మార్చింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నప్పుడు ఒక ఏఎన్‌ఎం మాత్రమే ఉండే వారు. ఆమెకు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించేవారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల వల్ల ఏరియా, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులపై భారం పడేది. ఓపీలు ఎక్కువగా ఉండటంతో జ్వరం లాంటి చిన్న చిన్న జబ్బుల కు గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం పల్లెదవాఖానాల రూపంలో ప్రణాళిక చేసింది.

పల్లె దవాఖానాల్లో ఒక డాక్టర్‌, ఫస్ట్‌ ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంను స్టాఫ్‌గా నిర్ధారించారు. ఎంబీబీఎస్‌ వైద్యులు లేనిచోట మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రోవైడర్‌ ను నియమించారు. బీఎస్సీ నర్సింగ్‌, బీఏఎంఎస్‌ అభ్యర్ధులను వైద్యులుగా ఎంపిక చేస్తున్నారు. వారు పట్టణాల్లో ప్రభుత్వ నియామకాల్లో ఎంపిక కావడంతో కొందరు వెళ్లి పోతున్నారు. మరికొందరు పీజీ సీట్లు రావడంతో రిజైన్‌ చేస్తున్నారు. పనిచేస్తున్న ఎంఎల్‌ హెచ్‌పీలకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వేతనం చెల్లిస్తుంది. కానీ కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాలేదన్న సాకుతో వేతనాలు నిలిపివేస్తుండటంతో వైద్యులు ఆందోళన చేయాల్సిన పరిస్ధితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది పల్లె దవాఖానాల్లో పనిచేయ డానికి సుముఖత చూపడం లేదు. దీంతో జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి పల్లెదవాఖానాల్లో మందులు అందిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 153 పల్లె దవాఖానాలు ఉండగా 27 చోట్ల ఒక్కరు కూడా సిబ్బంది లేరు. ఇక ఖమ్మం జిల్లాలో 161 పల్లె దవాఖానాలుండగా వాటిలో 61 చోట్ల ఖాళీలు ఉండటంతో పార్లమెంట్‌ ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ వేశారు. వీటిలో కొన్ని భర్తీ కాగా ఇప్పటికీ 11 చోట్ల ఖాళీలు ఉన్నాయి. నాటి నోటిఫికేషన్‌ ఎంపికైన వారిలో కొందరు ఇంకా జాయిన్‌ కాలేదు. ఆ ఖాళీలు కూడా అలానే ఉన్నాయి. చాలా చోట్ల పల్లె దవాఖానలు పాత పంచాయతి భవనాలు, స్కూల్‌ బిల్డింగ్‌లు, గ్రంథాలయా ల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పల్లె దవాఖానాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో నూతన బిల్డింగ్‌లను నిర్మిస్తున్నారు. ఈ దవాఖానాలో మూడు గదులు, ఓస్టోర్‌ రూం ఉంటుంది. మొత్తం 1020 చదరపు అడుగులు ఉండేలా పల్లె దవాఖానాలను డిజైన్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా పల్లె దవాఖానాలో వైద్య సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడేలా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలంటున్నారు.

Latest Articles

ట్రెండింగ్‌లో సుధీర్ బాబు ‘హరోంహర’

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తోంది. ఏకంగా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈటీవీ విన్‌, ఆహాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్