కోటి ‘అవర్ ఫ్యాక్టరీ’ యాప్‌ను లాంచ్ చేసిన చిన్నికృష్ణ

‘ఖైదీ నంబర్‌ 150, శ్రీమంతుడు,  దండుపాళ్యం2-3, భరత్‌ అనే నేను, కాటమ రాయుడు’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కోటి.  ఆయన  ప్రారంభించిన  అవర్‌ ఫ్యాక్టరీ యాప్‌‌ను సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో కోటి యాదవ్‌ నెలకొల్పిన ఈ ప్యాషన్‌ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత చిన్నికృష్ణ, సత్య మాస్టర్‌, చిన్న శ్రీశైలం యాదవ్‌, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొని కోటి యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

యాప్ లాంచ్ సందర్భంగా రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘కోటి మంచి వ్యక్తి.. సంఘ సేవకుడు. ఇలాంటి వ్యక్తి వ్యాపారంలో రాణిస్తే మరింత మందికి సేవలు అందిస్తాడు. ఆయన ప్రారంభించిన ‘అవర్‌ ఫ్యాక్టరీ’ యాప్‌ సక్సెస్‌ అయి నంబర్‌వన్‌ కావాలని, ఒక కార్పొరేట్‌ సంస్థగా ఎదగాలని ఆశిస్తున్నాను. అతను సాధిస్తాడనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

సత్య మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘కోటి గొప్ప సేవకుడు. అవర్‌ ఫ్యాక్టరీ పేరుతో బట్టల షాప్‌ ఏర్పాటు చేశారు. ఆయనకు ఉన్నదాంట్లో కొంత డబ్బు ఎప్పుడూ సేవలకే ఖర్చు చేస్తుంటారు. ఈ వ్యాపారంలో ఆయన రాణించి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు.

ఖైదీ నంబర్‌ 150, శ్రీమంతుడు,  దండుపాళ్యం2-3, భరత్‌ అనే నేను, కాటమ రాయుడు’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కోటి. అలాగే జీ, మా టీవీల కోసం పలు సీరియళ్లలోనూ నటించారు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవల కృష్ణ పరమాత్మ అనే పేరుతో ఓ బ్యానర్‌ను ప్రారంభించి త్వరలో సినిమాలు కూడా నిర్మించబోతున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్