33.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

స్వతంత్ర టీవీ కథనంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వీడియోపై ఆలయ అధికారులు స్పందించారు. భద్రతా లోపంపై స్వతంత్ర టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించి ఆలయ కమిటీ.. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి ఘటనపై దర్యాప్తు చేపట్టింది. విచారణలో కొందరు అనుమానితులను గుర్తించారు. దేవస్థానం పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పోలీసులకు చేరింది వీడియో వ్యవహారం.

విజయవాడ దుర్గగుడి తరుచూ వివాదంలో చిక్కుకుంటుంది. భక్తులు పరమపవిత్రంగా భావించే అమ్మవారి మూలవిరాట్ ను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆల‌యంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమైనప్పటికీ… భద్రతా ఉన్న ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం, ఏకంగా అమ్మవారి మూలమూర్తిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంపై భక్తులు ఫైర్‌ అయ్యారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు..? సీసీ కెమెరాలను కూడా సిబ్బంది పరిశీలిచడం లేదా అంటూ నిలదీశారు. అమ్మవారి ప్రతిష్ట దెబ్బ తీసేలా వ్యవహారిస్తున్న ఆకతాయాకులపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అని భక్తులు ఆందోళన చెందడంపై కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర టీవీ. దీనిపై స్పందించిన అధికారులు చర్యలకు పూనుకున్నారు.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్