బుద్వేల్ ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ జారీ.. ఎంత పలుకుద్దో చూడాలి మరీ..!

స్వతంత్ర  వెబ్ డెస్క్: ఔటర్‌ రింగురోడ్డు కేంద్రంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) మరో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. రాజేంద్రనగర్‌ను అనుకొని ఉన్న బుద్వేల్‌ పరిధిలో (Budvel) ఒకేసారి దాదాపు 182 ఎకరాల్లో ఈ లేఅవుట్‌ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌ తరహాలో దీన్ని గ్రీన్‌ఫీల్డ్‌ గ్రోత్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తున్నది. ఐటీ కారిడార్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యలో ఔటర్‌ రింగురోడ్డును అనుకొని ఉన్న ఈ భారీ లేఅవుట్‌లో ప్లాట్లను ఎకరాల చొప్పున విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

సుమారు 100 ఎకరాలను 14 ప్లాట్లుగా చేసి ఈ నెల 10న ఆన్‌లైన్‌ వేలంలో విక్రయించేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ఈ లేఅవుట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కొనుగోలుదారులకు అందించేందుకు ఈ నెల 6న టీహబ్‌లో ప్రీ-బిడ్‌ మీటింగ్‌ను నిర్వహించనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ లేఅవుట్‌లో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు 150, 120 అడుగుల విస్తీర్ణంతో కూడిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నిబంధనలకు లోబడి ఐటీ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు, దవాఖానలు, స్టార్‌ హోటళ్లు, హైరైజ్‌ నివాస భవనాలు వివిధ అవసరాలకోసం 44 అంతస్థుల వరకు నిర్మించేలా లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్