విదేశీ ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ లేదా పన్ను విధించే ఆలోచనలో ఉందంటూ వచ్చిన వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్చార్జ్ విధించే ప్రతిపాదనపై ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతోందని CNBC-TV18 కథనం ప్రచురించింది.
ఈ వార్తపై శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఆ కథనంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రశ్నే లేదన్నారు.
ప్రజలకు మెరుగైన జీవన విధానం, వ్యాపార సౌలభ్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.



