స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ మంత్రి రోజా మరోసారి విరుచుకు పడ్డారు. నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబునాయుడు జైల్లోనే ఉంటారని అన్నారు. ఆయనతోపాటు లోకేశ్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని విమర్శించారు. యువగళం పాదయాత్ర చేయలేక లోకేశ్ మంగళం పాడితే.. ఫ్యాషన్ షోకు వెళ్లే మాదిరిగా భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతు భువనేశ్వరిపై విమర్శల వర్షం గుప్పించారు. భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా శ్రీవారి వద్ద పూజలు చేసినట్లున్నారని..తాము కూడా నిజం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రోజా తెలిపారు. నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై, ఇన్నర్ రింగ్ రోడ్డుపై సీబీఐ విచారణ కోరాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్‌ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్‌కు ఇటు ఒక బ్యాచ్, అటు ఒక బ్యాచ్ కూర్చుని సెలక్ట్ చేసినట్లు ఉందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
భువనేశ్వరిది బస్సు యాత్ర కాదు.. ఫ్యాషన్ షో: మంత్రి రోజా
0
287
Next article
Latest Articles
నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా
హైదరాబాద్: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్ వ్యాపారులు...
- Advertisement -
- Advertisement -


