ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర కొనసాగుతోంది. మొదటి రోజే పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏపీ అసెంబ్లీకి 236 , లోక్‌సభకు 43 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తెలంగాణలో మొత్తంగా 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ రెండో రోజు కూడా హేమాహేమీలు నామినేషన్లు వేయనున్నారు. భారీ ర్యాలీగా, రోడ్ షోలతో కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినే షన్లు వేస్తున్నారు. ఇవాళ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఇవాళే నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. కాసేపట్లో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఇక బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వరి కూడా ఇవాళే నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర
0
215
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


