విడిపోయిన నిహారిక – చైతన్య జంట

స్వతంత్ర వెబ్ డెస్క్: నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల – చైతన్య జొన్నలగడ్డ మ్యూచ్యువల్ డైవర్స్‌తో విడిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న వీరు ఇరువురు.. మ్యూచ్యువల్ అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా.. అది ఈరోజుతో అఫీషియల్ గా పూర్తయింది అని తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొంతకాలం క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చిన వీరి వివాహం కొన్నాళ్ల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి కుటుంబ సభ్యులు వివాహాన్ని రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించారు.

వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లయింది. ఇక వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే వివరాల మీద మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో జొన్నలగడ్డ చైతన్య అతని ఇంస్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని ప్రచారం మొదలైంది. అప్పుడే వీరు విడిపోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అప్పటికి నిహారిక ఆ ఫోటోలను తొలగించకపోవడంతో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏమో అనుకున్నారు. ఆ తర్వాత నిహారిక కూడా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయం మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.

Latest Articles

చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్