పాఠశాలలోనే టీచర్- ప్రిన్సిపల్ డిష్యుం డిష్యుం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు.. విచక్షణ కోల్పోయి విద్యార్థుల చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పట్నాలోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కిటికీ తలుపుల విషయంలో ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య ఘర్షణ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.

ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. దీంతో ముగ్గురు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి జుట్టు జుట్టు పట్టుకొని చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన విద్యార్థుల కళ్ళ ముందే జరగడం గమనార్హం. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌‌గా మారింది. దీనిపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నరేశ్‌ స్పందిస్తూ.. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ముందు నుంచే ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్