రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు

మరో పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఇరుక్కున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందకు రాహుల్​పై కేసు, రెండేళ్లు జైలు శిక్ష విధించగా.. తాజాగా, మరో పరువునష్టం కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. విషయమేంటనే… ఇటీవల లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వీర్‌ సావర్కర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా…ఇందుకు స్పందించిన సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌(Satyaki Savarkar) పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. నిరాధారంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి మండిపడ్డారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్‌ తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అని.. ఈ వ్యాఖ్యలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సావర్కర్‌ సవాల్‌ విసిరారు.

Read Also: చీమలపాడు బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

Follow us on:  Youtube,  Koo,  Google News

Community-verified icon

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్