Madhya Pradesh liquor policy: మందుబాబులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బార్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా మద్యం షాపుల్లో పర్మిట్ రూములకు కూడా పర్మిషన్ లేదని హోంమంత్రి సర్వోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. అలాగే లిక్కర్ షాపుల కాంట్రాక్టు రెన్యూవల్ ఛార్జీలను 10శాతం మేర పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బార్లు తెరవాలని నిరసన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 2010 నుంచి కొత్తగా ఓ మద్యం దుకాణాన్ని కూడా తెరవలేదన్నారు మిశ్రా.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బార్ షాపులు క్లోజ్
0
399
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


