‘హనుమాన్’పై బాలయ్య ప్రశంసలు

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని వీక్షించి.. దర్శకనిర్మాతలపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన హనుమాన్ స్పెషల్ షోకు బాలయ్య కుటుంబంతో కలిసి వచ్చారు. సినిమా చూశాక దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్‌రెడ్డిని అభినందించారు. బోలెడంత కంటెంట్‌తో కన్నుల పండుగగా సినిమా ఉందని కితాబిచ్చారు బాలకృష్ణ. హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని బాలకృష్ణ చెప్పారు.

హనుమాన్ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కన్నడ స్టార్‌ హీరోలు కూడా సినిమా అద్భుతమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కన్నడ కంఠీరవ శివరాజ్‌ కుమార్‌, ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌ శెట్టి హనుమాన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘ఈ చిత్రంలో తేజ సజ్జ బాగా నటించాడు. ఎంతో కష్టమైన సన్నివేశాలను కూడా సులువుగా చేశాడు. దర్శకుడి విజన్‌ మరోస్థాయిలో ఉంది. నటీనటులందరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అద్భుతం. చివరి 30 నిమిషాలు నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. 2025లో రానున్న ‘జై హనుమాన్‌’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.

‘‘హనుమాన్’ను ప్రశంసించేందుకు అందరితో పాటు నేనూ సిద్ధమయ్యాను. ప్రశాంత్‌ వర్మ కథను తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు ఈ స్థాయి విజయాన్ని అందించాయి. తేజ సజ్జ ఆకట్టుకున్నాడు’ అని ఎక్స్‌లో రిషబ్‌ శెట్టి అభినందించారు. ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించడంపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. పోస్టర్‌ను షేర్‌ చేసి ‘మీరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు’ అని క్యాప్షన్‌ పెట్టారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారత్‌లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ అదరగొడుతోంది. స్టార్‌ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తోంది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్