మోహనకృష్ణ ఇంద్రగంటి కొత్త సినిమా ఎవరితో..?

శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ అగ్ర కథానాయిక సమంత ‘యశోద’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు.‌ లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో తొలి సినిమా నాని ‘జెంటిల్ మన్’. బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా ‘సమ్మోహనం’ చేశారు. ఇప్పుడు చేయబోయేది వాళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా. ఇందులో ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. హీరోగా ‘బలగం’ సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్