మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధం.. రేవంత్ రెడ్డి విమర్శ

స్వతంత్ర వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోదీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు.

నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే… అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్