ఖైరతాబాద్ గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లక్షలాది మంది భక్తులు గణపతిని దర్శించుకుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండబోతుందని తెలిపారు. హిమాయత్ నగర్ డివిజన్‌లోని అవంతి నగర్, ముత్యాలమ్మ బస్తీలో కోటి 60 లక్షల అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాలలో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు దానం తెలిపారు. నిర్వాహకులు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు… ముస్లిం మత పెద్దలు మిలాద్ ఉన్ నబీ ను 19న నిర్వహిస్తామని చెప్పారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్
0
191
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


