కేంద్రంలో బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రులు

    ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలో కేంద్రమంత్రులు ఒక్కక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. విదేశాంగ మంత్రిగా జై శంకర్‌, రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, సురేష్‌ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యలు న్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పని చేస్తామ న్నారు. చైనా సరిహద్దులో సమస్యలున్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.

   రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ బాధ్యతలు చేపట్టారు. గత పదేళ్లలో రైల్వేశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా మన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని.. 10ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. రైల్వేల విద్యుదీకరణ, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, కొత్త రకాల రైళ్లు, కొత్త స్టేషన్‌ల పునరాభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. రైల్వే సామాన్యుల రవాణా విధానం, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నుముక అన్నారు.

    పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. తనకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను నిర్వర్తించేం దుకు పూర్తి సంసిద్ధతతో పని చేస్తానన్నారు. ప్రపంచంలోని పర్యావరణ సంక్షోభానికి చాలా పెద్ద కార్యాచరణ కార్యక్రమంగా గ్లాస్గో COPలో మిషన్ లైఫ్‌ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. మిషన్ లైఫ్ సుస్థిర అభివృద్ధి, బుద్ధిపూర్వక వినియోగం సహాయంతో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. భూమిని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రధాని మోదీ ఏక్ పెద్ మా కే నామ్ ప్రచారాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించాలన్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్