మ్యాక్స్ అతిపెద్ద మానీక్విన్స్ బొమ్మల కొలువును ప్రారంభించిన సితార

హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2023: దుబాయ్ కేంద్రంగా కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్ మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర, తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు  82 ఫ్యాషన్ స్టోర్స్‌కు చేరనుంది. దసరా ఉత్సవాల సందర్భంగా వినియోగదారుల కోసం లేటెస్ట్ ఫ్యాషన్లను అతి తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా నెల రోజుల పాటు మ్యాక్స్ ఈ వేడుకలకు సిద్ధమైంది. హార్ట్ ఆఫ్ హైదరాబాద్‌‌గా ఉన్న కేపీహెచ్‌బీ నెక్సస్ మాల్‌లో 30 x 40 అడుగుల భారీ బొమ్మల కొలువును ప్రారంభించింది. ఈ పండుగ సీజన్‌లో వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు బహుమతులను అందించనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. 150కి పైగా మానీక్విన్స్ ( బొమ్మలు)తో కూడిన బొమ్మల కొలువును ఆవిష్కరించారు. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను వివరిస్తుంది. మ్యాక్స్ తాజా పండుగ కలెక్షన్‌తో ఇవి అలంకరించబడ్డాయి. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ ఎన్జీవోల నుండి పిల్లలు, వృద్ధులకు దసరా కానుకలను అందజేశారు.

ఈ సందర్భంగా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మ్యాక్స్ ఫ్యాషన్‌- ఇండియా వైస్ ప్రెసిడెంట్ & మార్కెటింగ్ హెడ్ పల్లవి పాండే మాట్లాడుతూ, “అతిపెద్ద బొమ్మల కొలువు, దసరా ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా కస్టమర్‌లకు షాపింగ్‌కు మంచి సంతోషాన్ని అందించడమే మా ప్రయత్నం. రోజువారీ ఫ్యాషన్ కోసం సాంప్రదాయ, లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు అందించిడమే మా లక్ష్యం” అని అన్నారు.

‘‘నగరంలో ఈ వేడుకను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ మాకు చాలా ప్రత్యేకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మా అమ్మకాలలో 64% ఈ నగరం నుండి వస్తున్నాయి. మేము మరింత మంది కస్టమర్లకు సేవలందించేందుకు, వారి పండుగ వేడుకల్లో భాగమయ్యేందుకు ఎదురుచూస్తున్నాము” అని మ్యాక్స్ ఫ్యాషన్ రీజినల్ బిజినెస్ హెడ్ పెద్దిరాజు ఆనంద్ రామ్ తెలిపారు.

Latest Articles

ఆ విషయంలో.. నయన్.. మారిందా..?

అందాల తార నయనతార.. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ.. లేడీ సూపర్ స్టార్ గా కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. నయన్.. స్టార్ హీరోల సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్