Maoist Rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మావోయిస్ట్ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్ట్ పార్టీ మాత్రం ధృవీకరించలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం.  రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రుల పల్లి.

రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా ప్రకటించడం విశేషం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాలలో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు, గుజరాత్ లతో కూడి మావోయిస్టుల రైతు ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్ ఛార్జిగా కూడా పని చేశారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్ పాండే, సత్తెన్న, పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్