తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతు న్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆల యాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాల కు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జన సంద్రంగా మారింది. మూడు రోజులపాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురు వారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. పంచాక్షరీ నామస్మ రణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది.


