Car Racing: అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్.. అలజడిలో టూరిస్ట్​లు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వికారాబాద్(Vikarabad) జిల్లా అనంతగిరి(Anantagiri) కొండల్లో జోరుగా కార్ రేసింగ్(car racing) జరుగుతోంది. అగస్టు 15న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండలకు భారీగా వెళ్లిన యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. సైరన్‌ వేసుకుంటూ దూసుకువచ్చి విన్యాసాలు నిర్వహించి హంగామా సృష్టించారు. బైక్ లతో స్టంట్స్(bike stunts)  చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను  చిత్రీకరించిన పలువురు వాటిని సోషల్ మీడియాలో(social media) పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా(Viral) మారాయి.

అయితే అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్‌ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్‌లో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కొందరు అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్‌ నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుుతన్నారు. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్ల రేసింగ్‌తో పర్యాటకులకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్