- బంగ్లా క్రికెట్ బోర్డుపై కెప్టెన్ హసన్ ఆగ్రహం
- సినిమా చూపిస్తానంటూ కామెంట్స్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేపట్టిన ప్రీమియర్ క్రికెట్ లీగ్ వరుసగా వైఫల్యాలు చవిచూస్తోంది. రానున్న కాలంలో కూడా ఇది బాగుపడే సూచనలు లేవని అక్కడ క్రికెటర్లు విసుక్కొంటున్నారు. ఇదే క్రమంలో సడెన్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ హసన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ కు మంచి ప్రచారం కల్పించి ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విఫలమైందన్నది ఆయన విమర్శ. బీపీఎల్‌కు తనను ఒకటి రెండు నెలల పాటు సీఈవోగా నియమిస్తే అద్భుతాలు చేస్తానని ప్రకటించారు. నాయక్ సినిమా అంతా చూశాం కదా, ఒక్కరోజు ముఖ్యమంత్రి అయినందుకే అద్భుతాలు జరిగాయని చూశాం కదా, అదే మాదిరిగా ఒక్కరోజులో కూడా అద్భుతాలు చేయవచ్చని హసన్ అంటున్నారు. అందుచేత కొంతకాలం సీఈవో పోస్టింగ్ ఇప్పించాలని, అసలైన ప్రగతిని సాకారం చేసి చూపిస్తానని ఆయన చెబుతున్నారు.

ఈ నాయక్ సినిమాకు మూలం తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ఒకే ఒక్కడు సినిమా. అప్పట్లో అర్జున్ హీరోగా శంకర్ రూపొందించిన ఈ సినిమా సంచలనం రేపింది. ఒక్కరోజు లో ముఖ్యమంత్రి చేసే అద్బుతాల్ని ఈ సినిమాలో చూపించారు.