మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం- ప్రధాని మోదీ

స్వతంత్ర వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన మోదీ ఇవాళ బెంళూరులోని ఇస్రోను సందర్శించారు. చంద్రయాన్-3ని విజయవంతంగా జాబిల్లిపైకి పంపించిన శాస్త్రవేత్తలందర్ని అభినందించారు. వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..  అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలని అన్నారు.

‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రయాన్‌ – 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ – 3 విజయంపైనే ఉంది. విజయం పట్ల శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధారణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్