స్వతంత్ర వెబ్ డెస్క్: సెప్టెంబర్ 30న చెన్నైలో నిర్వహించాల్సిన దళపతి విజయ్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. లియో సినిమా విషయంలో ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒత్తిడి తెస్తున్నాడని, ఆడియో లాంచ్‌కు పర్మిషన్లు ఇవ్వడం లేదని కోలీవుడ్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు జరుగుతోన్న ప్రచారంపై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు.
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఓ టాక్ వినిపిస్తోంది. డీఎంకే పవర్‌లో ఉండటంతో ఉదయనిధి స్టాలిన్, అతని సంస్థ రెడ్ గెయింట్ రెచ్చిపోతోందని అనుకుంటున్నారు. ప్రతీ సినిమాలో షేర్, లేదంటే ముఖ్యమైన ఏరియా హక్కులు అడుగుతున్నారట. తమ సంస్థకు హక్కులు ఇవ్వని సినిమాలను ఏదో రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడట. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు విజయ్ లియో మీద సైతం రెడ్ గెయింట్ కన్ను పడినట్టుగా కనిపిస్తోంది.
విజయ్ హీరోగా నటించిన లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంతో నిర్మాణ సంస్థపై దళపతి విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. సెప్టెంబర్ 30న చెన్నైలో లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేసింది. ఇందుకోసం నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదికగా ఫిక్స్ చేసింది. ఈ ఈవెంట్‌తోనే లియో ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ భావించారు. లియో సినిమాకు లోకేష్ కనరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ తర్వాత దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది. త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా…సంజయ్‌దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
అయితే, నెహ్రూ ఇండోర్ స్టేడియంలో లియో ఆడియో లాంఛ్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి డీఎంకే ప్రభుత్వం అనుమతులను నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ హీరో, డీఎంకే మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్స్ సంస్థ లియో సినిమా చెన్నై థియేట్రికల్ రైట్స్ హక్కుల కోసం పోటీపడింది. కానీ ఉధయనిధి స్టాలిన్‌ను కాదని మరో డిస్ట్రిబ్యూటర్స్‌కు లియో ప్రొడ్యూసర్ రైట్స్‌ను అమ్మినట్లు సమాచారం. ఆ కోపంతోనే ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు డీఎంకే ప్రభుత్వం అనుమతులు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ఈ విషయం మీద రకరకాల రూమర్లు వ్యాప్తి చెందాయి. తాజాగా నిర్మాణ సంస్థ ఓ క్లారిటీ అయితే ఇచ్చింది.
జనాలు ఎక్కువ మంది వస్తారని అంచనాతో.. పాస్‌లు ఎక్కువగా ఇవ్వడంతో.. భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని మేం లియో ఆడియోను రద్దు చేయాలని అనుకుంటున్నాం.. అభిమానుల కోరిక మేరకు మేం నిరంతరం అప్డేట్లు ఇస్తూనే ఉంటాం.. అందరూ అనుకుంటున్నట్టుగా.. మా మీద ఏ పార్టీ ఒత్తిడీ గానీ, ఇతర కారణాలేమీ గానీ లేవు అని క్లారిటీ ఇచ్చింది.
అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం దీనిపై భగ్గుమంటున్నారు. ఇది కావాలని చేసిందే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే క్యాన్సిల్ చేశారని నమ్ముతున్నారు. ఇక రెడ్ గెయింట్ సంస్థ మీద, ఉదయనిధి స్టాలిన్ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 2011 నుంచి 2020 వరకు రెడ్ గెయింట్ సంస్థ 22 సినిమాలను కొంటే.. 2021 నుంచి 2023 వరకు 33 సినిమాలను కొనేసింది. డీఎంకే పవర్లో ఉందనే కదా? ఇలా చేస్తున్నారు అంటూ లిస్ట్‌ను కూడా బయటపెట్టేస్తున్నారు.
ఈ ఆరోపణల మీద ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తాడో లేదో చూడాలి. అసలే ఉదయనిధి చుట్టూ ఇప్పుడు వివాదాలు అల్లుకున్నాయి. సనాతన ధర్మం ఓ రోగం లాంటిదని, దాన్ని నిర్మూలించాలని చేసిన కామెంట్లతో దేశ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.