తెలంగాణ అసెంబ్లీలో కేంద్రబడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు రాలేదని విమర్శించారు. మోదీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ తమ నిర్ణయం చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చిందే మీ అభిప్రాయమా? అని చురక అంటించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము అయ్యలు, తాతల పేర్లు చెప్పుకొని పైకి రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగామన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్
0
286
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


