కేటీఆర్‌, కవితకు వింత జబ్బు ఉంది- కడియం శ్రీహరి

బిఆర్ఎస్‌పై స్టేషన్ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బీఆర్ఎస్‌ శ్రేణులకు లేదన్నారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు.

ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు సోకిందనే అనుమానం వస్తుందని అన్నారు.

వింత జబ్బు ఎక్కువగా కేటీఆర్, కవితలకే ఉన్నదని.. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత…ఇప్పుడు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కడియం శ్రీహరి విమర్శించారు.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్