సీఎం రేవంత్ క్రికెట్‌నే కాకుండా రైతుల గురించి కూడా పట్టించుకోండని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొని ఆయన రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపో యిందన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కళకళలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెలవెలబోతున్నాయన్నారు. రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మెట్పల్లి పాత బస్టాండ్‌లో రైతు దీక్షలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే
0
194
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


