గుడివాడ వేదికగా చంద్రబాబుకి సవాల్ విసిరిన కొడాలి నాని

స్వతంత్ర వెబ్ డెస్క్: గుడివాడ వేదికగా కొడాలి నాని చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబు మగాడు అయితే గుడివాడ నుండి పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని ప్రకటించారు. ఇక రాష్ట్రానికి సీఎం జగన్ మాత్రమే సీఎం అని.. గుడివాడికి తాను మాత్రమే ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు కొడాలి నాని.

గుడివాడ ఎమ్మెల్యేగా ఇళ్ళ పట్టాల సమస్యను పరిష్కరించమని అన్నట్లో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడిగాను.. అప్పుడు నేను టీడీపీ ఎమ్మెల్యే అయినా వైఎస్సార్ సానుకూలంగా స్పందించారని గుర్తుచేసుకున్నారు.. 45 రోజుల్లో 75 ఎకరాలను భూసేకరణ చేసి ఇచ్చారు.. ఈ భూమి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన భిక్షగా పేర్కొన్న ఆయన.. అందుకే ఇక్కడ 18 అడుగుల రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.. 800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఖర్చు చేసింది రూ.180 కోట్లు మాత్రమే.. లబ్ధిదారుల నుంచి సైతం డబ్బులు వసూలు చేశాడని మండిపడ్డారు.. ఇక, ఇవాళ సిగ్గు లేకుండా టిడ్కో ఇళ్ళు నేనే కట్టాను అంటున్నాడు అని ఫైర్‌ అయ్యారు. పాదయాత్ర సమయంలో ఇక్కడే వైఎస్‌ జగన్ విడిది చేశారు.. అప్పుడే 300 చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికే ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు కొడాలి నాని. రైలు గేట్ల దగ్గర ఫ్లై ఓవర్ కావాలని విజ్ఞప్తి చేశాను.. సీఎం జగన్‌ కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారని తెలిపారు. ఇక, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుడివాడలో వాటర్ పంప్ హౌస్ కట్టారు.. గుడివాడ ప్రజల దాహార్తిని తీర్చిన మహానుభావుడు వైఎస్ అని పేర్కొన్నారు. 30 లక్షల మంది పేదలకు లక్షా ఎకరాలు భూసేకరణ చేసి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్‌ అని ప్రశంసలు కురిపించారు.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్