స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు. మొదటి సారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ రద్దు చేసింది. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారింది. కేసీఆర్ సర్కార్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని ఘాటు విమర్శలు చేశారు.