37.1 C
Hyderabad
Friday, May 16, 2025
spot_img

రికార్డులు సృష్టించిన కాంతార సినిమా..!-బెస్ట్ మూవీ, యాక్టర్ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌

  • హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా
  • కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తీస్తే..ఏకంగా 450 కోట్లు వసూలు

సంచలన విజయంతో రికార్డులు సృష్టించిన కాంతార సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఏడాది రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలుత కన్నడలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆపై తెలుగు సహా పలు భాషల్లోనూ ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేశారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందీ సినిమా. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచి మరో ఘనత సాధించింది. కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిందని సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. రెండు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ మూవీ అవార్డు విభాగంతో పాటు బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేట్ అయిందని తెలిపింది. కన్నడిగుల సంప్రదాయ భూత కోల నేపథ్యంలో దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్