వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల

కామాక్షి భాస్కర్ల ఎంచుకునే స్క్రిప్ట్‌లు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కామాక్షి భాస్కర్ల దూసుకుపోతోన్నారు. ఆమె ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉన్నారు. కామాక్షి ఇటీవలే నవీన్ చంద్ర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతోన్నారు. ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులతో కామాక్షి బిజీగా ఉన్నారు.

 

ఈ మేరకు కామాక్షి స్పందిస్తూ.. ‘మూడు చిత్రాలలోనూ నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా ఫిల్మోగ్రఫీకి చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ప్యాషన్‌, ప్రేమ ఉండటంతో కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే ఇష్టంగా ఉంటుంది’ అని అన్నారు.

 

12A రైల్వే కాలనీ అయినా, పొలిమేర అయినా, సైతాన్ అయినా కామాక్షి తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఇలా ప్రతీ సారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ కారెక్టర్‌కు నిజాయితీగా ఉండటం వల్ల యాక్టర్‌ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తూ వస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను.నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నేను నమ్ముతాను’ అని అన్నారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్