‘జితేందర్‌రెడ్డి’ ఎవరో తెలిసిపోయింది!

‘బాహుబలి’, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ‘జితేందర్ రెడ్డి’ అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్‌లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కానీ ఆ పోస్టర్‌లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆ పోస్టర్‌తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇప్పుడు ఆ సస్పెన్స్‌ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్‌ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్‌గా నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది ఆ పోస్. చూడడానికి ఒక యంగ్ పోలీస్‌లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో లీడర్ లుక్స్ ఉన్నాయి. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న తరువాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ జితేందర్ రెడ్డి సినిమానే రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఈ కథలో, ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్‌కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారు. రాకేష్ ఈ క్యారక్టర్‌కి ఎంత న్యాయం చేశారనేది మున్ముందు చూడాలి.

నటీ నటులు : రాకేష్ వర్రే, సుబ్బరాజు , శ్రీయాసరన్.

డైరెక్టర్ : విరించి వర్మ.
నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి.
కో – ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు
డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.
పీఆర్వో: మధు విఆర్

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్